తెలంగాణకు కొత్త డీజీపీగా రవి గుప్తా నియమితులయ్యారు. రవి గుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా(డీజీ) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవి గుప్తా హోం ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. కాగా, డీజీపీ అంజనీ కుమార్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేయగా.. ఆయన స్థానంలో రవి గుప్తా వచ్చారు.
రేవంత్ రెడ్డిని అంజనీ కుమార్ కలవడం పట్ల ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ఫలితాల విడుదల మధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించిన ఎన్నికల సంఘం.. అంజనీ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డిని కలిసిన కాసేపటికే ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకుంది. ఇక, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.