ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అవకాశం రానుందని సమాచారం. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడంతో పొన్నం ప్రభాకర్ కు మంత్రిగా అవకాశం వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. 7వ తేదీన ప్రభుత్వం ఏర్పడితే.. 9వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు.
ఫ్రీ టికెట్ ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి మరికొన్ని మంత్రి పదవులను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు.. అయితే మరో ఆరుగురికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
కరీంనగర్ కు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ కో ఆపరేటివ్ నుంచి విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన తన ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగింది. డిప్యూటీ సీఎం గా పొన్నం ప్రభాకర్ కే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది రాష్ట్రంలోనే ప్రజాదారణ పొందిన ముఖ్య నేతగా పేరున్న పొన్నం ప్రభాకర్ కే పదవి ఇవ్వాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.