తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన టీఎస్ ఈసెట్, పీజీఈసెట్ పరీక్షలు రేపటి నుంచి జరగనున్నాయి. ఆగస్టు 1న ఈసెట్ పరీక్ష, ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్ పరీక్ష జరగనుంది. ఈనెల 13న జరగాల్సిన ఈసెట్ పరీక్ష, అదేవిధంగా 29 నుంచి ఆగస్టు 1 వరకు జరగాల్సిన పీజీఈసెట్ పరీక్షలు భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఎంసెట్ కీ విడుదల…
ఈనెల 18, 19, 20వ తేదీల్లో జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్రొ.గోవర్థన్ ఈ రోజు (శనివారం) విడుదల చేశారు. ప్రశ్నల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 1 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. శనివారం ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆదివారం సైతం జరగనుంది. ఆగస్టు పదో తేదీ తర్వాత ఎంసెట్ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.