Saturday, November 23, 2024

TS: ఫ్రాన్స్‌కు వెళ్లిన కేటీఆర్‌.. ఇన్నోవేటివ్‌.. స్టార్టప్స్‌ కంపెనీలకు ప్రోత్సాహం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం ఫ్రాన్స్‌లో అడుగుపెట్టింది. ఫ్రాన్స్‌ పర్యటనలో తొలిరోజు మంత్రి కేటీఆర్‌ ఫ్రెంచ్‌ ప్రభుత్వ డిజిటల్‌ అఫైర్స్‌ అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌తో బుధవారం సమావేశమయ్యారు. ఇన్నోవేషన్‌, డిజిటలైజేషన్‌, ఓపెన్‌ డేటా లాంటి ఫ్రాన్స్‌, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశం గురించి సమావేశంలో చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్‌, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, ఓపెన్‌ డేటా పాలసీ, రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న డిజిటల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ గురించి మంత్రి కేటీఆర్‌ అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌కు వివరించారు. తెలం గాణలోని అంకుర సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఫ్రాన్స్‌లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడం గురించి కూడా చర్చించారు.

సమావేశంలో ఫ్రాన్స్‌లో భారత డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ కేఎం ప్రఫుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌, ఏవియేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement