హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఏళ్ళ తరబడి పోరాడి సాధించుకున్న తెలంగాణాలో రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక సగంలో ఆగవద్దన్న ఉద్దేశంలో, ప్రజల కోసం మరిన్ని చేసి చూపాలన్న తపన, పట్టుదలతో భారాస అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిరంతర శ్రామికుడిగా ప్రతినిత్యం గరిష్ట సమయం ప్రజాక్షేత్రంలోనే గడుపుతున్నారు. రోజుకు 18 గంటలపాటు రాజకీయ కసరత్తులోనే నిమగ్నమవుతున్నారు.
గత నెల 16న హుస్నాబాద్ నుచంఇ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఈ నెల తొమ్మది వరకు 42 నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. నవంబర్ 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు. దాపావళి పండగ సందర్భంగా 10, 11, 12 తేదీల్లో విరామం తీసుకున్నారు. అయినప్పటికీ ఇంటి నుంచే అనేక నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు రాజకీయ సమీక్షలు నిర్వహించారు.
ఇక సోమవారం నుంచి రెండో విడత ప్రచారం మొదలు పెట్టారు. సాధ్యమైనంత మేరకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచార సభల ద్వారా ప్రజలకు నమ్మకం కలిగించాలని, ప్రతిపక్షాల వాగ్ధానాలపై వానికి అప్రమత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశాగానే షెడ్యూల్ ఖరారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. రోజుకు 3 నుంచి 4 సభలతో హోరెత్తించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రెండు విడత ప్రచార షెడ్యూల్‌లో భాగంగా 16 రోజుల్లో 54 నియోజకవర్గాలను చుట్టేయాలని భారాస అధినేత నిర్ణయించుకున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులు గెలిపించాలని పిలుపునిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు రెండో విడత ప్రచారానికి కదం తొక్కారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీఆర్‌ఎస్ తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు. తమ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో భారాస అధినేత, సీఎం కేసీఆరల్ తన మార్క్ కనిపించేలా ప్లాన్ చేసుకున్నారు.
కాగా, నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ అన్ని వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకువస్తున్నారు. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్‌ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. నవంబర్ 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. నవంబర్ 28వ తేదీ వరకు మొత్తం 54 సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
కేసీఆర్ ప్రచార రెండో విడత షెడ్యూల్ ఇదే..
- 13న దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట
- 14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం.
- 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్
- 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్
- 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల
- 18న చేర్యాల
- 19న అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి
- 20న మానకొండూరు, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ
- 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట
- 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి
- 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరు
- 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
- 25న హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
- 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
- 27న షాద్‌నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి
- 28న వరంగల్ (ఈస్ట్, వెస్ట్), గజ్వేల్‌లలో ప్రచార సభలు నిర్వహించనున్నారు.