Saturday, November 23, 2024

TS | పెరుగుతున్న చలి తీవ్రత.. రానున్న రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలంతా ఉక్కపోతకు గురిచేస్తూ రాత్రి అవగానే చలితో గజగజ వణికిస్తోంది. రాత్రి సమయంలో వాతావరణంలో తేమశాతం పెరగడం…పగలు సగానికి సగం పడిపోవడవమే దీనికి కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు దేశం విడిచి వెళ్లడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

- Advertisement -

ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలి గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోందని పేర్కొంది. రాత్రి సమయంలో చలిగాలులు వీస్తున్నాయి. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ కు పడిపోయాయి. మరోవైపు చలి తీవ్రత పెరుగుతుండడంతో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement