Tuesday, November 26, 2024

TS | ఎన్నికల సిరాకు ఫుల్‌ డిమాండ్‌.. రెడీ చేసిన ఈసీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఎన్నికల సందడి ఊపందుకుంది. నేటితో ప్రచార గడువు ముగియనుంది. ఇక నేటి సాయంత్రం నుంచి సైలెన్స్‌గా ప్రలోభాల పర్వం మొదలు కానుంది. మరోవైపు జనమంతా ఓట్లు- వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పలు అంశాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికలు పూర్తిస్థాయిలో రెడీ అవుతున్నాయి.

2019 జనవరి 15న ప్రారంభమైన ప్రభుత్వ కాలపరిమితి 2024 జనవరి 16తో ముగియనుంది. నవంబర్‌30న షెడ్యూల్‌ జారీకాగా, ఈ నెల 30న ఒకేరోజు ఏకకాలంలో పోలింగ్‌ జరగనుంది. ఆదివారం 3న లెక్కింపు జరగనుంది. 35356 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ తీర్పును ఇవ్వనున్నారు. 3.26 కోట్ల ఓటర్లు తమ తీర్పు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలలో 2290 మంది అభ్యర్ధులు రిలో ఉన్నారు.

- Advertisement -

ఎల్బీనగర్‌లో అత్యధికంగా 48మంది, గజ్వేల్‌లో 44 మంది, కామారెడ్డిలో 39మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు, బాల్కొండలో ఎనిమిది మంది అభ్యర్ధులు ఉన్నారు. కాగా ఈ ఎన్నికల్లో మరోసారి పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ రసాభాసాగా నడిచింది. ఈసీ గుర్తించిన 2.45 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇక ప్రతీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతీ ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు కనిపించడం మామూలే.

ఎడమచేతి చూపుడు వేలు లేకపోతే ఏ వేలికైనా సిరా గుర్తు వేస్తారు. ఈ సిరా వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది. ఓటు వేసిన వ్యక్తి మళ్లీ ఓటు వేకుండా ఇలా సిరా గుర్తు పెట్టే పద్ధతి 1962 సార్వత్రిక ఎన్నికల్లో మొదలైంది. దొంగఓట్లు వేయకుండా కట్టడి చేసేందుకు సిరా గుర్తు పద్ధతి సత్ఫలితాలను ఇచ్చింది. ఎన్నికల్లో ఉపయోగించే సిరా మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ ఫ్యాక్టరీలో తయారయ్యేది. ఈ ఫ్యాక్టరీని మైసూర్‌ మహారాజు కృష్ణరాజ వడయార్‌-4 , 1937లో స్థాపించారు.

ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఇంకునే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్‌ నైట్రేట్‌ ఉండటం వల్ల ఇంకు గుర్తు 3-4 రోజుల వరకు చెరిగిపోదు. అందుకే ఓటు వేయగానే ఎడమచేతి చూపుడు వేలుపై గుర్తు పెడతారు. సిరా గుర్తుపై ఎన్నికల సంఘం నిబంధనలు కూడా ఉన్నాయి. 37(1) నిబంధన ప్రకారం ఓటర్‌ ఎడమచేతి వేలుపై సిరా గుర్తును చూడాల్సిన బాధ్యత పోలింగ్‌ అధికారిది.

ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌…

భారతదేశంలో తయారయ్యే ఈ ఎన్నికల సిరాకు ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. 29 దేశాల్లో జరిగే ఎన్నికలకు ఇండియా నుంచి ఎగుమతి అవుతుందని అంచనా. మైసూర్‌లోనే కాదు హైదరాబాద్‌లోని రాయుడు ల్యాబరేటరీస్‌లోనూ ఎన్నికల సిరా తయారవుతోంది. ఈ ఇంక్‌ను స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లలకు పోలియో డ్రాప్స్‌ వేసే సమయంలోనూ గుర్తుపెట్టేందుకు ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లో తయారయ్యే సిరా కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక తెలంగాణ ఎన్నికల కోసం రెండు లక్షల సిరా బాటిళ్లు సిద్ధం చేశారని అంచనా.

ఎన్నిక ఏదైనా ఓటరు ఓటు వేసినట్లుగా గుర్తింపు ఇచ్చేది వేలుపై వేసే సిరా చుక్కే. ఒక్కో సందర్భంలో ఒక్కో వేలుపై ఓటరు ఓటు వేసినట్లుగా గుర్తించేందుకు గోరుపై ఇంకుతో గుర్తు పెడతారు. ఇది ఎన్నికల సంఘం అమలులోకి తెచ్చి అమలు చేస్తున్న విధానం. రెండు నెలల ముందే మైలార్‌ సంస్థకు ఈసీ ఆర్డర్‌ పెడుతుంది. ఈ దఫా దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లి ఎన్నికలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సిరాకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ఈ దఫా 26లక్షల ఇంకు బాటిళ్లను ఈసికి సమకూర్చేందుకు మైలార్‌ సంస్థ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. మన దేశంలోనే కాకుండా అనేక దేశాలకు ఇక్కడినుంచే ఎన్నికల ఇంకు సరఫరా అవుతోంది.

వేళ్లకు లేదంటే…

పోలింగ్‌ సరళిలో ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నది. యాప్‌లతోపాటు, అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ఈసీ సాంప్రదాయ పద్దతులను కూడా కొనసాగిస్తున్నది. ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నాక అక్కడి పోలింగ్‌ అధికారులు ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు పెట్టడం ఎన్నికల వ్యవస్థ తొలితరం నుంచీ వస్తున్న ఆనవాయితీ. ఏ ఓటరైనా రెండోసారి ఓటు వేయకుండా నివారించేందుకు ఇలా సిరాతో గుర్తు వేస్తారు. అయితే చూపుడు వేలు లేకపోతేనో…! చూపుడు వేలు లేకపోతే అనే సందేహానికి కూడా ఈసీ దగ్గర సమాధానం ఉంది.

ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఈసీ అనుసరిస్తోంది. ఎడమ చేతి మధ్య వేలుకు సిరా గుర్తు వేసేందుకు తదనంతర ప్రత్యామ్నాయం కాగా, ఆ వేలు కూడా లేకపోతే ఉంగరపు వేలుకు, ఈ నాలుగూ లేకుంటే చిటికన వేలుకు సిరా వేస్తారు. ఇక ఎడమ చేయి మొత్తంగా లేకపోతే… కుడిచేయి చూపుడు వేలుకు సిరా గుర్తు వేయాలని చట్టంలో ఉంది. అదేవిధంగా ఆ వేలు లేనిపక్షంలో మద్యవేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలును ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఇంకో సందేహం వ్యక్తమయ్యేందుకు కూడా అవకాశం ఉంది. రెండు చేతులకూ వేళ్లు లేనట్లయితే ఏం చేస్తారని…అటువంటి సందర్భాల్లో వేళ్ల మొదలు, మధ్యభాగంలో గుర్తు వేస్తారు. అసలు చేతులే లేకుంటే ఎడమ చెంపకు సిరా గుర్తు పెట్టాలని ఈసీ నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement