Saturday, November 16, 2024

TS | పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన..

హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతానికి మెట్రో లైనుకు విస్తరించే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఫలక్ నుమా సమీపంలో ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శిలాఫలకం వేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా ఇతర ఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం జేబీఎస్ – ఎంజీబీఎస్‌ వరకు ఉన్న మెట్రో లైనును ఫలక్‌నుమా వరకు ఇంకో 5.5 కిలోమీటర్లు పొడిగించనున్నారు. ఈ రైలుమార్గంలో 5 మెట్రో స్టేషన్లు ఉంటాయి..

ఈ మెట్రో లైను నిర్మాణం కనుక పూర్తయితే సికింద్రాబాద్‌ నుంచి జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ మీదుగా పాతబస్తీకి నేరుగా ప్రయాణం చేసే వీలుంటుంది. ఎంజీబీఎస్ నుంచి సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషిర్ గంజ్, ఫలక్ నుమా మెట్రో స్టేషన్లు ఉంటాయి.

అయితే, ఈ విస్తరణ కోసం రూ.2 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. కేటాయించిన నిధుల్లో రూ.వెయ్యి కోట్లు స్థల సేకరణకే ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరడంతోపాటు పాతబస్తీ మరింత అభివృద్ధి దిశలో దూసుకుపోనుందని రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement