Saturday, November 23, 2024

TS | కక్ష సాధింపు చర్యలను న్యాయపరంగా ఎదుర్కొందాం.. కార్యకర్తలకు కవిత అభివాదం

ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ లోని ఆమె నివాసంలో ఇవ్వాల (శుక్రవారం) మధ్యాహ్నం నుంచి దాదాపు నాలుగైదు గంటలపాటు జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల అనంతరం మనీలాండరింగ్‌ సెక్షన్ల కింద కవితపై కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

ఈడీ అధికారుల సోదాల అనంతరం కవిత తన నివాసం నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ శ్రేణులను అభివాదం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. కాగా, కవితను అదుపులోకి తీసుకున్న‌ ఈడీ శంషాబాద్ ఏర్‌‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి తరలిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement