బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎలక్షన్ కమిషన్ చర్యలకు ఆదేశించింది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మే 13న జరిగిన పోలింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేటీఆర్ పై యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలిపింది. పోలింగ్ రోజున కేటీఆర్ మాట్లాడుతూ తాను ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా బయటపెట్టడం నేరంగా పేర్కొంది.
దీనిని ఎన్నికల ఉల్లంఘనగా పేర్కొన్న ఈసీ కేటీఆర్ పై చర్యలకు ఆదేశిస్తూ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కాల పరిమితి విధించింది. అయతే గడువు ముగిసినా కేటీఆర్ వివరణ ఇవ్వకపోవడంతో చర్యలకు ఆదేశించినట్లు పేర్కొంది.