Sunday, November 24, 2024

TS | మేడారానికి తరలి వస్తున్న భక్తులు.. హన్మకొండ నుంచి స్పెషల్‌ బస్సులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వెళ్తుంటారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తుంటారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటు-ంది. దీంతో కొందరు భక్తులు రెండు నెలల ముందుగానే మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ సంఖ్య కూడా లక్షల్లోనే ఉండడం గమనార్హం.

మేడారం జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నప్పటికీ… ఇప్పటికే ప్రభుత్వం జాతర ఏర్పాట్లను చేస్తోంది. జాతర ముందు రోజుల నుంచి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపనుంది. అయితే ఇప్పటికే మేడారానికి తరలివస్తున్న భక్తుల కోసం బస్సులను నడుపుతున్నట్లు వరంగల్‌ ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలత ఇప్పటికే ప్రకటించారు. భక్తుల సౌకర్యార్ధం ఈనెల 17 నుంచి స్పెషల్‌ బస్సులను ప్రారంభించారు. ప్రతీ బుధ, ఆదివారం సెలవు దినాల్లో హన్మకొండ బస్టాండ్‌ నుంచి ప్రతీ 45 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచారు.

భక్తుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు పెంచనున్నారు. ఇదిలా ఉంటే జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లు విడుదల చేసింది. ఇందులో గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ.14.74కోట్లు, ఐటీడీఏ ఇంజినీరింగ్‌ విభాగానికి రూ.8.28కోట్లు, పోలీస్‌ శాఖకు రూ.10.50 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.2.80 కోట్లు.. ఇలా వివిధ శాఖలకు నిధులు కేటాయించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఈసారి జాతర ఏర్పాట్లు, నిర్వహణలో తమ మార్క్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement