Friday, November 22, 2024

TS | ముగ్గురు పోస్టల్‌ అధికారులపై సీబీఐ కేసు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోస్టల్‌ హెడ్‌క్వార్టర్స్‌లో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ముగ్గురు పోస్టల్‌ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌, మరో రెండు మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల నియామకాలకు విషయంలో సదరు అధికారులు లంచం తీసుకున్నట్టు సీబీఐ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు 10మంది కంటింజెంట్‌ లేబర్‌లను ఎంటీఎస్‌గా నియామకాలు జరిపిన అంశంపై విచారణ చేపట్టారు.

ఈక్రమంలో ఇద్దరు కంటింజెంట్‌ లేబర్ల నుంచి రూ. 25 లక్షలు లంచం తీసుకున్నట్టుగాను అధికారులపై సీబీఐ అభియోగాలు మోపింది. 2022 జూలై 16న రూ.2 లక్షలు, అదే సంవత్సరం జూలై 26న రూ.1 లక్ష ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలలో సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి లభ్యమైన పత్రాలపై దర్యాప్తు వేగవంతం చేసినట్లు సీబీఐ అధికారులు వివరించారు.

https://twitter.com/CBIHeadquarters/status/1788847050798350827
Advertisement

తాజా వార్తలు

Advertisement