Friday, October 18, 2024

TS | 24 గంటల్లో రూ.10 ల‌క్ష‌ల‌కుపైగా నగదు సీజ్

ఎన్నికల్లో భాగంగా గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ.10,17,940 నగదు, 24.06 లీటర్ల మద్యంతోపాటు రూ.61,481 విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్‌ రోస్‌ తెలిపారు. నగదు, ఇతర వస్తువులకు సంబంధించి 3 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించి 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. అదేవిధంగా 12 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేశారు.

జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం రూ. 12,97, 39,560 నగదు, రూ.1,86,74,708ల విలువ గల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేసినట్లు రోనాల్ రోస్ తెలిపారు. 19,822.71 లీటర్ల మద్యం పట్టుకోవడంతో పాటు 147 కేసులు నమోదు చేసి 141 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.

నగదు ఇతర వస్తువులపై ఇప్పటీ వరకు 296 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించామని, 194 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశారని , 2450 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు .ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 2,88,06,740, పోలీస్,ఐటీ వారురూ. 9,93,53,130, -, ఎస్ ఎస్ టీ బృందాల ద్వారా రూ.15 ,79, 690 నగదు సీజ్ చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement