Sunday, November 24, 2024

TS| సీఎంఆర్‌ బకాయిలు చెల్లిస్తేనే ధాన్యం కేటాయింపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ బకాయిలను 100శాతం తీర్చిన మిల్లర్లకు మాత్రమే 2023-24 రబీ కాలానికి ధాన్యం కేటాయిస్తామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. 2019, 2020 రబీ కాలంతోపాటు 2021-22, 2022-23 ఖరీఫ్‌కు చెందిన సీఎంఆర్‌ బకాయిలను తీర్చాలని షరతు విధించింది.

పెండింగ్‌ సీఎంఆర్‌ బకాయిలకు 125శాతం బ్యాంకు గ్యారంటీ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. మెదటిసారి డిఫాల్టర్‌గా తేలిన మిల్లర్లకు మాత్రమే ధాన్యం కేటాయింపులో సడలింపు ఉంటుందని, పదే పదే డిఫాల్టర్లుగా తేలితే ధాన్యం కేటాయించేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్‌. చౌహాన్‌ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేశారు.

ఆయా జిల్లాల్లోని ధాన్యం ఆధారంగానే అక్కడి మిల్లర్లకు ధాన్యం కేటాయించే పరి మాణం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. మిల్లు సామర్థ్యంలోని 75శాతం మేరకే ధాన్యం కేటాయిస్తామని స్పష్టం చేశారు. రానున్న సెప్టెంబరు -2024 కల్లా పెండింగ్‌ సీఎంఆర్‌ డ్యూలను చెల్లిస్తేనే మిల్లర్ల బ్యాంకు గ్యారంటీ బాండ్లలను వెనక్కి ఇస్తామని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement