Tuesday, November 19, 2024

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ అరెస్ట్ …. క్ష‌ణాల‌లో విడుద‌ల‌

వాషింగ్టన్‌: శృంగార తారకు చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను మన్‌హటన్‌ క్రిమినల్‌ కోర్టు హౌస్‌ వద్ద పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. అనంతరం పటిష్టమైన భద్రత మధ్య ఆయన కోర్టులోకి ప్రవేశించారు. అంతకు మునుపు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ట్రంప్‌ టవర్‌లోని తన నివాసం నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు వెలుపలకు వచ్చారు. తన కోసం వేచి చూస్తున్న ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల వైపు చూసి చెయ్యి ఎత్తి పిడికిలి బిగించారు. చేతిని ఊపుతూ వారికి అభివాదం చేశారు. అనంతరం కారులో మన్‌హటన్‌ కోర్టుకు బయలుదేరారు. కేవలం 6.4 కి.మీ.ల దూరంలో ఉన్న మన్‌హట్టన్‌ క్రిమినల్‌ కోర్టు హౌస్‌కు నిముషాల వ్యవధిలో ట్రంప్‌ వాహన శ్రేణి చేరుకుంది. కారులో నుంచి దిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు కోర్టులోకి అడుగుపెడుతూ ఒక్క నిముషం ఆగారు. అక్కడ జనసందోహానికి చేతిని ఊపుతూ అభివాదం చేశారు. ఆ సమయంలో ట్రంప్‌ చాలా ప్రశాంతంగా, సీరియస్‌గా కనిపించారు.

అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఎదుట ట్రంప్‌ను ప్రవేశ పెట్టారు. కోర్టులో ట్రంప్‌ను రహస్యంగా విచారించనున్నట్లు న్యూయార్క్‌ సుప్రీంకోర్టు జడ్జి జుయాన్‌ మెర్చన్‌ ముందుగానే వెల్లడించారు. మీడియా అవుట్‌లెట్లు, టీవీ కెమేరాలను కోర్టు లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఓ శృంగార తార నోటికి తాళం వేయడానికి ఆమెకు డబ్బు ముట్టజెప్పిన కేసులో ట్రంప్‌పై క్రిమినల్‌ అభియోగం మోపాలని గత గురువారం మన్‌హటన్‌ గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించింది. ఈ ఆరోపణలకు ట్రంప్‌ తన వాదనలు వినిపిం చడానికి మంగళవారం కోర్టుకు వచ్చారు. కాగా ఈ విచారణను కవర్‌ చేయడా నికి అనుమతి ఇవ్వాలని పలు అమెరికా మీడియా సంస్థలు కోర్టును అభ్యర్థిం చాయి. న్యాయస్థానం వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది. అయితే, విచారణ మొదలవడానికి ముందు, కోర్టుగది, ట్రంప్‌ ఫొటోలు తీసుకునేందు కు ఐదుగురు స్టిల్‌ ఫొటోగ్రాఫర్లకు మాత్రం అనుమతి ఇచ్చింది. విచారణ సమయంలో మాత్రం మీడియా కెమేరాలకు అనుమతి లేదని కోర్టు నిర్ద్వద్వంగా చెప్పింది.

కాగా ఈ కేసులో తాను తప్పుచేయలేదని ట్రంప్ స్వయంగా న్యాయమూర్తికి విన్నవించుకున్నారు.. తనపై అభియోగాలన్నీ తప్పుడేవేనని,వాటిని కొట్టివేయాలని అభ్యర్ధించారు.. ఇరువ‌ర్గాల వాద‌ల‌న విన్న కోర్టు వెంట‌నే ఆయ‌న‌ను విడుద‌ల చేసింది.. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన ట్రంప్.. ఫ్లోరిడాలోని తన నివాసం మార్ – ఏ – లాగో నుంచి తన మద్దతు దారులను ఉద్దేశించి మాట్లాడారు.. తాను ఈ కేసులో నిర్ధోషిన‌ని వెల్ల‌డించారు.. 2024 ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేసేందుకు అడ్డంకుల‌కోసం ఈ కేసు అంటూ చెప్పుకొచ్చారు.

ఏమిటీ కేసు?
2006లో ట్రంప్‌, తానూ ఓ కార్యక్రమంలో కలుసుకున్నామనీ, ఆ తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నామని స్టార్మీ డేనియల్స్‌ అనే శృంగార చిత్రా ల నటి ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచాలంటూ ట్రంప్‌ న్యాయ వాది మైకేల్‌ కోహెన్‌ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ప్రధాన ఆరోపణ. ఇది నిజమేనని కోహెన్‌ కూడా ఒప్పుకున్నాడు. దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్‌ అభియోగం మోపాలని గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించింది. ఆయనపై చేసిన ఆరోపణలను సీల్డు కవరులో ఉంచారు. అందులో ట్రంప్‌పై 30 ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement