- ఇప్పటికే 277 ఎలక్టోరల్ ఓట్లతో విజయ దుందుభి
- మరో 35 ఎలక్టోరల్ సాధించే దిశగా అడుగులు
- 226 ఓట్లకే పరిమితమైన హ్యారీస్
- 26 రాష్ట్రాలలో ట్రంప్ కే పట్టం
- రెండో సారి అధ్యక్ష పీఠంపై ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లతో విజయ దుందుభి మోగించారు. అధ్యక్ష పీఠం దక్కించుకోవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం.. ఆ మార్క్ ను దాటేసిన ట్రంప్ర్ 300 మార్క్ దిశగా సాగుతున్నారు. కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లు పోల్ అయ్యాయి. ఎన్నికల ఫలితాలు మొదలైనప్పటి నుంచి కూడా ట్రంప్ ముందంజలోనే ఉన్నారు.
ఈ ఎన్నికల్లో ఎంతో ముఖ్యమైన స్వింగ్ స్టేట్స్ ఫలితాల్లో కాస్తా అటు ఇటు అయినప్పటికీ కూడా ట్రంప్ నే విజయం వరించింది. ముందు నుంచి కూడా ఎన్నికల్లో గెలుపు మీద ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ఆయనే గెలిచారు. మొత్తం 50రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా ఆ వెంటనే కౌంటింగ్ ప్రారంభించారు.. ఇప్పటికే 44 రాష్ట్రాల ఫలితాలు విడుదలయ్యాయి.. మరో ఆరు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.. వాటిలో ఆయిదు రాష్ట్రాల్లో ట్రంప్ అధీక్యంలో ఉండగా, ఒక్క రాష్ట్రంలో మాత్రం కమలా హ్యారీస్ ముందజంలో ఉన్నారు. మొత్తంగా ట్రంప్ ఇప్పటి వరకు 26 రాష్ట్రాల్లో విజయం సాధించగా, కమలా హ్యారీస్ 18 రాష్ట్రాలకే పరిమితమయ్యారు.
రెండోసారి అధ్యక్ష పీఠం…
277 ఎలక్టోరల్ ఓట్లతో మేజిక్ ఫిగర్ క్రాస్ చేసిన ట్రంప్, 67,204,711 పాపులర్ ఓట్లు సాధించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు.మేజిక్ ఫిగర్‌కు 44 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో హ్యారిస్ ఆగిపోయారు. చివర్లో గట్టి పోటీ ఇచ్చినా స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ ఆధిపత్యం కొనసాగడంతో కమలా ఓటమి పాలవ్వక తప్పలేదు.
మొదటి నుంచి చివరి వరకూ ట్రంప్ దూకుడు కొనసాగింది. ఒక సమయంలో స్లో అయిన ట్రంప్ 230 ఓట్ల దగ్గర చాలాసేపు నిలిచిపోయారు. ఆ సమయంలో కమలా హ్యారిస్ వేగంగా అందుకుని గట్టి పోటీ ఇచ్చారు. 226 ఓట్ల దగ్గర కమలా ఆగిపోయారు. కమల హ్యారిస్‌కు 62,303,005 పాపులర్ ఓట్లు రాగా చివర్లో ట్రంప్ మెరుపు వేగంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.