మధ్యప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపులో విషాదం నెలకొంది. రైసెన్ జిల్లాలో ట్రక్కుభీభత్సం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి సుల్తాన్‌పూర్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకలో ట్రక్కు అదుపు తప్పి వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.11 మందికి పైగా గాయాలయ్యాయి.
జాతీయ రహదారిపై హోసంగాబాద్ నుండి పిపారియా గ్రామానికి వివాహ బృందం వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ జనాలను బలంగా ఢీకొట్టింది.వార్త అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రజత్ సారథే తెలిపారు. ఖమరియా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. మృతుల కుటుంబాలకు కలెక్టర్ అరవింద్ దూబే రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించారు.