నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 20 వార్డుల్లో 11 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. ఫార్వాడ్ బ్లాక్ పార్టీ 6 చోట్ల, కాంగ్రెస్ 2, స్వతంత్రులు ఒక స్థానంలో గెలుపొందారు. అత్యధిక స్థానాలు గెలిచిన టీఆరెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
కాగా, నకిరేకల్ పురపాలికలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. 1వ వార్డ్ – బిక్షం రెడ్డి (ఇండిపెండెంట్), 2వ వార్డ్- సునీల్ (టీఆర్ఎస్) ,3వ వార్డ్- చింతా స్వాతి(టీఆర్ఎస్), 4వ వార్డ్ – జాజుల సుకన్య(కాంగ్రెస్), 5వ వార్డ్ – లక్ష్మీ(ఫార్వాడ్ బ్లాక్ పార్టీ), 6వ వార్డ్ – ధనమ్మ(టీఆర్ఎస్), 7వ వార్డ్ – కొండ శ్రీను(టీఆర్ఎస్), 8వ వార్డ్ – పావని శ్రీనివాస్ (ఫార్వాడ్ బ్లాక్ పార్టీ), 9వ వార్డ్ – చెవుగోని రజిత (ఫార్వాడ్ బ్లాక్ పార్టీ), 10వ వార్డ్ –అఖిల(టీఆర్ఎస్), 11వ వార్డ్ – మొరిశెట్టి ఉమారాణీ(టీఆర్ఎస్), 12వ వార్డు -బానోతు వెంకన్న(టీఆర్ఎస్), 13వ వార్డు – పోతుల రవి (టీఆర్ఎస్), 14వ వార్డ్ -గడ్డం లక్ష్మీ(టీఆర్ఎస్), 15వ వార్డ్ – విజయం యసారపు వెంకన్న (ఫార్వాడ్ బ్లాక్ పార్టీ), 16వ వార్డ్ -జీ.సైదుల్(ఫార్వాడ్ బ్లాక్ పార్టీ), 17వ వార్డ్ – పల్లె విజయ్(టీఆర్ఎస్), 18వ వార్డ్ – ధైదా స్వప్న(కాంగ్రెస్), 19వ వార్డ్ – రాచకొండ శ్రీను(టీఆర్ఎస్), 20వ వార్డ్- రాములమ్మ(టీఆర్ఎస్)