వరంగల్ టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించేందు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. వరంగల్ నగర సమీపంలో సుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహించి, విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నగరంలోని మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ శివార్లలోని ఖాళీ స్థలాలను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పరిశీలించారు.
భారీ ఎత్తున జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి ఎలాంటి అటంకాలు కలగకుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
టిఆర్ఎస్ విజయగర్జన సభ… స్థలాన్ని పరిశీలించిన మంత్రులు ..
Advertisement
తాజా వార్తలు
Advertisement