టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే తాము రేవంత్‌ను 300 కిలో మీటర్ల లోతుకు తొక్కుతామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి లఫంగా మాటలు మాట్లాడుతున్నారని, బీజేపీ ఎంపీ అరవింద్ లంగా మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఆయన బుధవారం మాట్లాడిన మాటలన్నీ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.
నిరుద్యోగులకు 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, మహిళా రుణాలకు రూ.200 కోట్ల వడ్డీ చెల్లించామని చురకలు అంటించారు. రేవంత్‌కు టీపీసీసీ ఉద్యోగం రావడానికి కారణం కేసీఆర్.. తెలంగాణ తేవడమేనన్నారు. ఆకునూరి మురళి ఎక్కడ ఎవరికి అడ్వైజర్‌గా ఉన్నారో రేవంత్ చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు 200 కిలోమీటర్ల లోతులో పాతరపెట్టారని ఎద్దేవా చేశారు. ఇంకా సోనియా రాజ్యం ఎలా వస్తుందని.. 2009లో కొడంగల్‌లో పొత్తు వల్ల రేవంత్ గెలిచారని చురకలు అంటించారు.
ఈ వార్త కూడా చదవండి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు