సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. దీనిపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, కేసీఆర్ జాతీయ రాజకీయ అరంగేట్రానికి భయపడే హడావిడి నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఏనాడో ఖాయమైందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో బీజేపీ, కాంగ్రెస్ దుష్ట రాజకీయాలకు చెక్ పెడతామన్నారు. నిత్యావసర ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ గా మార్చిన కేసీఆర్ నాయకత్వాన్ని బల పరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ తరహా పథకాల కోసం బీజేపీ ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ప్రజల నుండి పెరుగుతున్న డిమాండ్ తోనే తెలంగాణ పై కుట్రలు చేస్తున్నారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement