న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీని ఓడించే సత్తా ఉన్నందుకే మునుగోడు ఉపఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మద్ధతు తెలిపామని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) సీనియర్ నేత చాడా వెంకట రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ప్రగతిశీల శక్తులన్నీ ఏకమవుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయని, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులతో ఒక వేదిక ఏర్పాటుకావాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. సీపీఐ జాతీయ మహాసభల్లో దేశానికి దశ, దిశ నిర్దేశించే రాజకీయ తీర్మానం చేస్తామని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానిగా అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ విభజన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.

అమరావతి రైతుల పాదయాత్రకు అండగా ఉంటాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే రైతుల పాదయాత్రకు అండగా ఉండాలని నిర్ణయించామని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. చాడా వెంకటరెడ్డితో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబట్టారు. మూడు రాజధానులపై గతంలో బిల్లు పెట్టినప్పుడు చర్చ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బెంజి కార్లలో తిరిగేవారు పాదయాత్ర చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి మూడు రాజధానులపై చర్చ లేవనెత్తారని దుయ్యబట్టారు.
మరోవైపు అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరపబోయే 24వ జాతీయ మహాసభలపై చర్చించినట్టు వెల్లడించారు. జాతీయ మహాసభలకు 29 రాష్ట్రాల ప్రతినిధులు, 20 దేశాల నుంచి ప్రత్యేక ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అక్టోబర్ 14న ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దీనికి సీపీఐ, సీపీఐ(ఎం) జాతీయ నాయకులు, కమ్యూనిస్టు ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్టు వెల్లడించారు. దేశంలో రాజకీయాలు ప్రమాదకరంగా మారిన తరుణంలో జరుగుతున్న జాతీయ మహాసభలు కీలకం కానున్నాయని వ్యాఖ్యానించారు.