అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు పూటకోటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జిహెచ్ఎంసి లో అధికార పార్టీ కార్పొరేటర్ల అరాచకాలు కూడా మొదలయ్యాయి. అధికారం వచ్చి రెండు నెలలు కూడా గట్టిగా గడవ లేదు…అప్పుడే అసలు రూపం బయట పెడుతున్నారు. తాజాగా తెరాస కార్పొరేటర్ విజయా రెడ్డి మౌలాలిలో హల్ చల్ చేశారు. ఓ భూ వివాదంలో నానా హంగామా సృష్టించారు. అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లి నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలగొట్టారు.పక్కనే ఉన్న వారు వీడియో తీయడానికి ప్రయత్నిస్తుంటే వారిపై కూడా దాడికి యత్నించారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement