Saturday, November 2, 2024

TG | ప్ర‌భుత్వంపై ట్రోలింగ్‌ చేస్తే జైలుకే !

సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వాన్ని, అందులో భాగస్వాములను, వ్యక్తులను, వ్యవస్థలను.. భ్రష్టు పట్టించే వారిని ఉపేక్షించవద్దని, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని, అవసరమైతే జైలుకు పంపాలని పోలీసులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వాన్ని కించపరిచేలా, అభూతకల్పనలతో కథనాలు ప్రసారం చేసినా, ప్రచురించినా, ప్రభుత్వ కార్యక్రమాలకు, నిర్ణయాలకు, చర్యలకు అడ్డుతగిలలే ప్రయత్నం చేసినా వదిలిపెట్టవద్దని స్పష్టం చేసింది. ప్రత్యేకించి ట్రోలింగ్‌కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్ల ద్వారా ప్రచారం చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలతో ఐటీ, పోలీసు తదితర శాఖల అధికారులు రంగంలోకి దిగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement