Tuesday, November 26, 2024

ఈవిడే డిటెక్టివ్ తీక్ష‌ణ‌..

బెంగాల్‌కు చెందిన ప్రియాంక త్రివేది అనేక బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. ప్రముఖ కన్న డ స్టార్‌ ఉపేంద్రను వివాహం చేసుకున్నా రు. వివాహం తర్వాత సెలెక్టివ్‌ గా సినిమా లు చేశారు.
ఇప్పుడు ‘డి-టె-క్టివ్‌ తీక్షణ’గా తన 50వ చిత్రంతో మన ముందుకు రానున్నారు. చిత్ర బృందం ఆకట్టు-కునే ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసింది. ప్రియాంక గన్‌ పట్టు-కుని యాక్షన్‌ పోజ్‌ తో ఉన్న ఈ ఫస్ట్‌ లుక్‌, -టైటిల్‌ ఆకట్టు-కుంటు-న్నాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ రఘు దర్శకత్వం వహిస్తుండగా పొలకల చిత్తూర్‌ ఆంధ్ర ప్రదేశ్‌ కు చెందిన గుత్తముని ప్రసన్న, జి ముని వెంకట్‌ చరణ్‌ ( ఈవెంట్‌ లింక్స్‌, బెంగళూర్‌) పురుషోత్తం బి (ఎస్‌ డి సి) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


ఇంత సుదీర్ఘమైన కెరీర్‌ నాకు దక్కినందుకు అదృష్టవంతురాలిని. నేను పుట్టింది బెంగాల్‌ లోనే అయినా పెరిగింది అంతా యూఎస్‌ సింగపూర్‌ లలో. నా సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. 1999 నుండి 2003 వరకు చాలా తక్కువ సమ యంలోనే నేను బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళ్‌, కన్నడ, ఒడియా సినిమాల్లో ఎన్నో చిత్రాలు నటించాను.
నా కెరీర్‌ తొలిరోజుల్లోనే నేను చాలా నేర్చుకోగలిగాను. తర్వాత వివాహం, పిల్లలు… జీవితం ఇలా మలుపు తిరిగింది. నేను నా ఫ్యామిలీ లైఫ్‌ తో చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మళ్ళీ నటిస్తానని అనుకోలేదు.
బాలీవుడ్‌ సినిమా అయిత్రాజ్‌ రీమేక్‌ శ్రీమతి లో ఉపేంద్ర తో కలిసి నటించాను. రవిచంద్రన్‌ సార్‌ తో క్రేజీ స్టార్‌ చేశాను. నేను ప్రధాన పాత్రలో నటించిన మమ్మీ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయం సాధించింది.
సినిమాల ఎంపికలో నాకు చాలా స్వేచ్ఛ ఉంది. ఉపేంద్ర తన అభిప్రాయాన్ని చెప్పి నిర్ణయాన్ని నాకే వదిలేస్తారు. ఆయన విషయంలో నేనైనా అంతే. కానీ నా సినిమాలకి సంబందించిన ఫైనల్‌ డెసిషన్‌ నాదే ఉంటు-ంది.
డిెటెక్టివ్‌ తీక్షణ నా 50వ సినిమా. దర్శకుడు రఘు చాలా హార్డ్‌ వర్కింగ్‌ అండ్‌ ప్యాషనేట్‌. ఇలాంటి ప్రధాన పాత్ర ఇంతకు ముందు ఎప్పుడూ ఒక మహిళ చేయలేదు. డి-టె-క్టివ్‌ తీక్షణ ఒక స్ట్రాంగ్‌, ఇం-టె-లిజెంట్‌, బ్రేవ్‌ ఉమన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement