Saturday, November 23, 2024

Tripura – బిజెపి ఎమ్మెల్యే ఘ‌న‌కారం .. అసెంబ్లీలో అశ్లీల వీడియో వీక్ష‌ణం ..

అగర్తలా: అధికార బీజేపీ ఎమ్మెల్యే అశ్లీల వీడియో చూసిన ఘటనపై త్రిపుర అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద రచ్చ జరిగింది. బాగ్‌బస్సా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లక్‌నాథ్‌ గతంలో అసెంబ్లీలో పోర్న్‌ వీడియో చూడ‌టంతో అసెంబ్లీలో అదే అంశాన్ని ప్రతిపక్ష టిప్ర మోతా పార్టీ ఎమ్మెల్యే అనిమేశ్‌ దెబ్బర్మ లేవనెత్తారు. పోర్న్ వీడియోలు చూస్తూ అసెంబ్లీ ప‌రువును మంట‌గ‌లిపిన బిజెపి ఎమ్మెల్యే పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు..

దీనిపై అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, సీపీఎం సభ్యులు కూడా టిప్ర మోతా పార్టీ సభ్యులతో జత కలిసి అధికార బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు దూషించుకున్నారు. సభ్యుల అరుపులు, కేకలతో అసెంబ్లీ దద్దరిల్లింది. అసెంబ్లీని ర‌ణ‌రంగంగా మార్చారు..చేసేదేమి లేక స్పీక‌ర్ స‌భను వాయిదా వేసి వెళ్లిపోయారు.. ఆ త‌ర్వాత గంట‌పాటు ఇరుపార్టీల ఎమ్మెల్యే మ‌ధ్యా దూష‌ణ భూష‌ణ‌లు కొన‌సాగాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement