Sunday, January 5, 2025

Tributes – మహిళల అభ్యున్నతికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే – సిఎం రేవంత్

హైదరాబాద్ మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి, కుల వివక్ష, పితృస్వామిక పీడలపై పోరాడిన వీరనారి, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం సావిత్రి బాయి పూలే జ‌యంతి సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆమె చిత్రపటానికి పూల మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

చారిత్రాత్మ‌క‌మైన మార్పు..

మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వం కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న తరుణంలో మహిళా ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పూలె దంపతుల సేవలను త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని అన్నారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సావిత్రి బాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంద‌న్నారు.

మ‌హిళ‌ల సాధికార‌త‌కోసం..

- Advertisement -

సావిత్రిబాయి ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం రేవంత్ అన్నారు. మహిళల సాధికారత, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్దికి ప్రజా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీసీలు, బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను పూర్తి చేసిన‌ట్టు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం స‌ల‌హాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు సావిత్రీ బాయి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement