న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అయిదవ వర్ధంతి . నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ నివాళి అర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారక వద్ద పుష్పాంజలి ఘటించారు. వర్ధంతి సందర్భంగా అటల్ సమాధిని పుష్పాలతో అలంకరించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా నివాళి అర్పించారు.
వాజ్‌పేయి నాయకత్వం నుంచి దేశం చాలా లబ్ధి పొందినట్లు ప్రధాని మోడి. తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. దేశ ప్రగతిలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని, అనేక రంగాలను 21వ శతాబ్ధం వైపు తీసుకువెళ్లినట్లు చెప్పారు
I join the 140 crore people of India in paying homage to the remarkable Atal Ji on his Punya Tithi. India benefitted greatly from his leadership. He played a pivotal role in boosting our nation's progress and in taking it to the 21st century in a wide range of sectors.
— Narendra Modi (@narendramodi) August 16, 2023