Friday, November 22, 2024

ఎఫ్‌ఆర్‌వో కు మంత్రుల‌ ఘ‌న నివాళి… అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు…

ఖమ్మం: ఫారెస్టు రేంజ్‌ అధికారి శ్రీనివాస రావు పార్థివదేహానికి మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌ నివాళులర్పించారు. వారి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌ని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్‌ కల్పిస్తూ జీవో విడుదల చేసిందన్నారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాధికారులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన గుత్తికోయలు అడవులను విచక్షణా రహితంగా నరికివేస్తున్నారని చెప్పారు. ఎఫ్‌ఆర్‌వో అంత్యక్రియలను ఖమ్మం జిల్లా ఈర్లపుడిలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి.. శ్రీనివాసరావు పాడెపట్టి ముందు నడిచారు. మంత్రుల వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే రెగా కాంతారావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డి ప్రియాంక వర్ఘీస్, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ దొబ్రియల్, రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, జ‌డ్పీ చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులు, అటవీ, పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పలువురు నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement