న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థకు నేషనల్ కంపెనీ లా అపిల్లేట్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది.. వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా వ్యవహించినన విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన జరిమానా రూ .రూ.1337 కోట్ల ను 30 రోజులలోగా చెల్లించాలంటూ ట్రిబ్యునల్ నేడు ఆదేశాలు జారీ చేసింది.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీర్పుపై గూగుల్ సంస్థ నేషనల్ కంపెనీ లా అపిల్లేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది.. అయితే అక్కడ కూడా గూగుల్ కి నిరాశే మిగిలింది.. నేషనల్ కంపెనీ లా అపిల్లేట్ ట్రిబ్యునల్ లోని ఇద్దరు జడ్జిల ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పునే సమర్ధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement