Friday, November 22, 2024

నేడు ఏపీ హైకోర్టులో పీఆర్సీపై విచార‌ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. రాష్ట్ర‌ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీపై హైకోర్టు విచారించ‌నుంది. కొత్త పీఆర్సీ కారణంగా తమకు రావాల్సిన ప్రయోజనాలు రాకపోగా, జీతాలు తగ్గుతున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీతో తమకు అన్యాయం జరిగిందంటూ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement