హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్రీడాప్రాధి కారిక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ట్రై రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీల్లో నాలుగు బహుమతులు, శాలువ, జ్ఞాపికలతో సత్కరించడంతో పాటుగా ప్రశంస సర్టీఫికెట్లు బహుకరించనున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ పోటీల్లో సుమారు 5 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు సమాచారం.
ఇటీవల క్రీడా ప్రాధికారిక సంస్థ నిర్వహించిన సీఎం కప్ పోటీలతో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు క్రీడాకారుల్లో ఉత్సాహం రావడంతో కేటీఆర్ పుట్టిన రోజు క్రీడల పండుగగా ట్రై పోటీలు నిర్హపించేందుకు శాట్స్ సిద్ధమైంది. ఈ పోటీల్లో సైక్లింగ్ కు ట్యాంక్ బండ్, నక్లస్ రోడ్డు వేదికకాగా, మహిళల మల్లయుద్ధానికి కోట్ల విజయ భాస్కర్ స్టేడియం, స్కేటింగ్ కు ఇందిరా పార్కు స్కేటింగ్ ట్రాక్ వేదిక కానుంది. ఈ నెల 24న ఉదయం నుంచి ఈ పోటీలను నిర్వహించనున్న నేపధ్యంలో పర్యవేక్షకులకు తగిన సూచనలను క్రీడాప్రాధికారిక సంస్థ చేస్తోంది.