జాతీయపతాకంలోని మూడు రంగులు, అశోక చక్రం ఉన్న కేకును కట్ చేస్తే జాతీయజెండాను అవమానించినట్టు కాదని మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించింది. 2013 నాటి కేసుకు సంబంధిం తీర్పును వెలువరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 సెక్షన్ 2 ప్రకారం ఇది నేరమే అవుతుందని పిటిషనర్ సెంథిల్‌కుమార్ వాదించగా.. కోర్టు మాత్రం ఆ వాదనను తోసిపుచ్చింది. అప్పట్లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా 6X5 వైశాల్యం కలిగిన కేకును కట్ చేశారు. ఆ వేడుకలకు కోయంబత్తూరు జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ కూడా హాజరయ్యారు. కట్ చేసిన కేకును దాదాపు 2,500 మందికి పంచి పెట్టారు. ఇది కచ్చితంగా జాతీయ పతాకాన్ని అవమానించడమే అవుతుందని సెంథిల్‌కుమార్ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనర్ వాదనను కొట్టేసింది. ఇండియాలోని ప్రజాస్వామ్యంలో జాతీయవాదం చాలా ముఖ్యమే. కానీ దానికి అతిగా కట్టుబడి ఉండటం దేశ శ్రేయస్సుకు మంచిది కాదు. కేవలం కేకు కట్ చేయడం అనేది దేశభక్తి లేకపోవడం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement