ఐపీఎల్లో మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ట్రెంట్ బౌల్ట్ రికార్డులకు ఎక్కాడు. ఇవ్వాల (సోమవారం) జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఇప్పటి వరకు ఈ రికార్డు సన్‌రైజర్స్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉండగా… ఈ మ్యాచ్ తొలి ఓవర్ లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ (6) ను ఔట్ చేసి భువీ రికార్డును బౌల్ట్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో మొదటి ఓవర్లో బౌల్ట్‌కు ఇది 26 వికెట్ కావడం విశేషం.