Saturday, September 14, 2024

Trending – డ్యాన్స్ స్టెప్టులతో ట్రాఫిక్‌ కంట్రోల్


ఓ పోలీస్ కానిస్టేబుల్‌ వింత ధోర‌ణి
ఇదే మండే మోటివేషన్
వీడియో షేర్ చేసిన‌ ఆనంద్ మహీంద్రా

సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్‌గా ఉంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఇక‌.. త‌ను చూసిన‌వి, త‌న దృష్టికి వ‌చ్చిన ప‌లు విష‌యాల‌ను అంద‌రితో షేర్ చేసుకుంటారు. తర‌చూ ఆసక్తికర విషయాలను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేస్తుంటారు. అలాగే.. అప్పుడ‌ప్పుడు మోటివేషన్ అంటూ మంచి వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా డ్యాన్స్ చేస్తున్న‌ ట్రాఫిక్ పోలీస్ వీడియోను ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేశారు.

- Advertisement -

మండే మోటివేష‌న్‌..
ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజిత్ సింగ్ ప‌నితీరు అద్భుతం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 16 ఏండ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంద‌రూ చేతుల‌తో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తే రంజిత్ సింగ్ మాత్రం త‌న డ్యాన్స్‌తో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తారు. ట్రాఫిక్‌లో ఆగి ఉన్న జ‌నాల‌కు త‌న స్టెప్పుల‌తో అల‌రిస్తారు. అయితే.. రీసెంట్‌గా రంజిత్ సింగ్ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా.. దాన్ని షేర్ చేస్తూ మండే మోటివేషన్ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోలీస్ బోరింగ్ ప‌ని అంటూ ఏమి ఉండదు అని నిరుపించారు. మ‌న పనిని మ‌నం ఎలా చేయాలనేది నీ చాయిస్ అంటూ రాసుకొచ్చారు. కాగా, ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement