హ్యాపీ సండే అంటూ రాజ్యసభ మాజీ సభ్యడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జె. సంతోష్ కుమార్ కొన్ని ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే.. ఓ అరుదైన జాతి పక్షి, పచ్చని చెట్లలో సేదతీరుతూ ఉన్న ఫొటోపై నెటిజన్లు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ‘‘అన్నా.. పచ్చని చెట్లు ఉంటేనే పక్షులు హ్యాపీగా ఉంటాయి. పచ్చదనం లేకుంటే పక్షుల మనుగడ కష్టమే.. అందుకని మీరు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పక్షులకు ఎంతో మేలు చేస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా.. ప్రధానంగా పక్షి జీవనం అంతా చెట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. అందులో ఒకటి ఆహార అన్వేషణ.. రెండోది సంతానోత్పత్తి.. ఈ రెండు ప్రధానాంశాలే పక్షుల వలసలకు కారణమవుతుంటాయి. ఉత్తర ధ్రువంలో గూడుకట్టుకను నివసించే పక్షులు వసంత రుతువులో సమృద్ధిగా లభించే కీటకాల కోసం, పచ్చని గడ్డి, చిన్న చిన్న మొక్కలతో గూడుకట్టుకునేందుకు వలస వస్తుంటాయి. ఇలా విదేశాల నుంచి మన దగ్గరకి విడిది కోసం వచ్చే వలస పక్షులు ఎన్నో ఉన్నాయని, వాటి సంతతి, సంరక్షణ సేఫ్ అనే ఫీల్ ఉంటుంది కాబట్టే వస్తుంటాయని ఇంకొంతమంది కామెంట్స్ రూపంలో కోట్ చేశారు. మానవ మనుగడలో జీవ వైవిధ్యం ఉండాలంటే అన్ని రకాల జంతు జాలం, పక్షుల మనుగడ కొనసాగాలి. దీనికి గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాలని మేథావులు చెబుతున్నారు.