ఈ విశ్వం మీద నివసిస్తున్న సకల జీవరాశులకు చెట్లే ప్రణవాయువు అని, మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికత, యోగా రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రహ్మా కుమారీస్ సమాజం అధ్వర్యంలో చేపట్టిన 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో బ్రహ్మకుమారిలతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ.. యోగా, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలను బోధించే బ్రహ్మకుమారీలు 50వ “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా మొక్కలు నాటాలనే బృహత్తర సంకల్పంతో “కల్ప తరు” పేరున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం కులషితమై మనిషి మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందనే ఆవేదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితాహరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మొక్కలు నాటడం మాత్రమే ఈ సృష్టిని కాపాడగలమనే ఒకే ఒక్క నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్న హరితహారం అడుగుజాడల్లో బ్రహ్మకుమారీ సమాజం “కల్ప తరు” పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం మంచి నిర్ణయమన్నారు. జూన్ 5వ తేదీ నుండి ఆగస్టు 25 వరకు జరగనున్న“కల్పతురు క్యాంపెయిన్ “లో భాగంగా క్యాంపెన్ ద్వారా దేశ వ్యాప్తంగా బ్రహ్మకుమారీస్ సెంటర్ల తరపున 40లక్షల మందితో కనీసం 40 లక్షల మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నట్లు బ్రహ్మకుమారీ అరుణ తెలిపారు. కార్యక్రమంలో బ్రహ్మ కుమారీలు BK గీత, BK రమాదేవి, BK ప్రసాద్, BK అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement