Tuesday, November 19, 2024

ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు అందుబాటులో వైద్యం : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట : ఫైలేరియా వ్యాధిగ్రస్తులను బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూస్తున్నదని, వీరికి ఆసరా ఫించన్లు అందజేస్తున్నట్లు రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వైద్యులను తెలిపారు. ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు అన్ని జిల్లా కేంద్రాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కేంద్రం లోని క్యాంపు కార్యాలయంలో రూ.40 లక్షలతో ఫైలేరియా వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత కిట్స్ పంపిణీ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైలేరియాతో బాధ పడుతున్న వారికి కొంత ఊరట కోసం మందులు, సబ్బులతో కూడిన ప్రత్యేక కిట్లు తయారీ చేసి జిల్లాలో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 8 వేల 121 మందికి పైగా ఫైలేరియా బాధితులకు ఉచితంగా కిట్స్ అందిస్తున్నట్టు తెలిపారు. ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు 3 నెలలకు ఒకసారి మందులు అందిస్తున్నామని, వాటిని వాడుకోవాలన్నారు. సిద్ధిపేటతో పాటు జిల్లాలోని అన్నిచోట్ల క్లినిక్ ఏర్పాటు చేసి బోధకాల వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించేలా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement