- వైద్యం వికటించింది.. భార్య మృతి చెందింది
- అల్లుడికి దేహశుద్ధి.. అనంతరం పోలీసులకు అప్పగింత
- హత్య నేరం కింద కేసు నమోదు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : యూట్యూబ్ వైద్యం అనుసరించి తన భార్య మృతికి కారణమైన ఓ వ్యక్తిని తన అత్తంటివారు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మహరాష్ట్రలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరికీ కను విప్పు కావాలి. యూట్యూబ్‌లో చూసి ట్రీట్మెంట్ చేసిన వ్యక్తిపై హత్యనేరం కింద కేసు నమోదు చేసి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. డాక్టర్లు పదేపదే హెచ్చరిస్తున్నా కొంతమంది యూట్యూబ్ వైద్యాన్ని అనుసరించి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు.
సంఘటన వివరాలు…
మహారాష్ట్రలోని గడ్చీరోలి జిల్లా బినుగుండా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య రోషిని గర్భిణి. ఆమెకు జ్వరం రావడంతో యూట్యూబ్‌లోని వైద్యసేవలు అనుసరించి మందులు ఇచ్చాడు. ఓ వైపు గర్బవతి కావడం.. మరో వైపు ఇన్పేక్షన్ తో కూడిన జ్వరం భాదపడుతుండటం తో అందవలసిన సరైన వైద్యం అందలేదు. భర్త అతి తెలివి ఉపయేగించి మోతాదుకు మించిన మందులు ఆమె పై ప్రయోగించడంతో అది వికటించి రోషిని మృతి చెందింది .
అల్లుడికి దేహశుద్ధి
ఈ విషయం తెలుసుకున్న గర్భిణి తల్లిదండ్రులు అల్లుడికి దేహశుద్ధి చేశారు. తమ కుమార్తెకు అల్లుడు, వారి కుటుంబ సభ్యులే కారణమని పోలీసులకు అల్లుడిని అప్పగిస్తూ ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.