Saturday, November 23, 2024

ప్రపంచకప్‌కు ట్రావిస్‌ హెడ్‌ దూరం?

వరల్డ్‌ కప్‌ పోటీలకు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియాక జట్టుకు ఎదురుదెబ్బ తలిగింది. డాషింగ్‌ ఓపెనర్‌ ట్రావిస్ హెడ్‌ గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో హెడ్‌ ఎడమ చేయి విరిగింది. గెరాల్డ్‌ కోహెట్జీ వేసిన 9వ ఓవర్‌ మొదటి బంతి హెడ్‌ చేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన ట్రావిస్‌ రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 17 పరుగుల వద్ద మైదానం వీడిన అతడు, ఆ తర్వాత మళ్లి బ్యాటింగ్‌కు రాలేదు. అతడి గాయంపై ఆసీస్‌ హెడ్‌కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ స్పందించాడు.

‘బ్యాటింగ్‌ చేస్తుండగా హెడ్‌ చేయి విరిగింది. అతడికి మరిన్ని స్కానింగ్‌లు చేస్తాం. గాయం తీవ్రత, కోలుకునేందుకు ఎంత సమయం పడుతుంది అనే విషయాలన్నీ త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపాడు. 29 ఏళ్ల ఈ లెప్ట్‌n హ్యాండర్‌ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాపై, ఆ తర్వాత జరిగిన యాషెస్‌ సిరీస్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. విధ్వంసక ఆటతో మ్యాచ్‌ను మలుపు తిప్పే హెడ్‌పై ఆసీస్‌ యాజమాన్యం హెడ్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది.

పాక్‌ పేసర్‌ నసీంషా కూడా..

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌కి ముందు పాక్‌ పేసర్‌ నసీంషా భుజానికి గాయమైంది. భారత్‌లో జరిగే మెగా టోర్నీకి బహుశా అతను ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఆసియాకప్‌ సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లకు ముందు ప్రాక్టీసు సందర్భంగా అతడు గాయపడ్డాడు. గురువారం దుబాయ్‌లో ఎక్స్‌రే తీయడం జరిగింది. ముందు ఊహించిన దానికంటే గాయం కొంచెం సీరియస్‌గానే కనిపిస్తోంది అని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. కాగా, అతని స్థానంలో భారత్‌ టూర్‌కి జమాన్‌ ఖాన్‌ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement