అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ పై రష్యా నిషేధం విధించింది. తమదేశంలో ప్రవేశించకుండా ఈ రూల్స్‌ని తెచ్చారు. 29 అమెరికన్లుతోపాటు 61మంది కెనడా దేశస్థులపై ప్రయాణ ఆంక్షలు విధించింది. గురువారం ప్రయాణ ఆంక్షలు విధించినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై అమెరికా, కెనడా ఆంక్షలను పురస్కరించుకుని రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అమెరికా, కెనడాకు చెందిన రక్షణశాఖ అధికారులు, వాణిజ్యవేత్తలు, జర్నలిస్టులు ఉన్నారని తెలిపింది. 29మంది అమెరికన్లు, 61కెనడీయన్లుపై విధించిన నిషేధపు ఆజ్ఞలు తక్షణం అమలులోకి వస్తాయని రష్యా విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. రష్యా నిషేధించిన అమెరికన్ల జాబితాలో ఏబీసీ న్యూస్ టెలివిజన్ ప్రజెంటర్ జార్జ్ స్టీఫనోపౌలోస్, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ డేవిడ్ ఇగ్నాటియస్, రష్యాను టార్గెట్ చేస్తూ వార్తలను ప్రచురించే మెడుజా న్యూస్ సైట్ ఎడిటర్ కెవిన్ రోత్‌రాక్, అమెరికా రక్షణశాఖ అధికారులుతోపాటు పెంటాగాన్ అధికార ప్రతినిధి జాన్‌కిర్బీ, డిప్యూటీ సెక్రటరీ కేథలీన్ హిక్స్ ఉన్నారు. అదేవిధంగా కెనడీయన్ల జాబితాలో కెనడా ప్రధాని జస్టిన్‌కు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కెమెరాన్ అహ్మద్ కూడా ఉన్నారు. కెనడీయన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ కమాండర్ స్టీవ్ బొవిన్ ఉన్నారు. కాగా రష్యా ఇంతకుముందే జుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement