Friday, November 22, 2024

పులిని మట్టుబెట్టేందుకు ఉచ్చు… రంగంలోకి షూట‌ర్లు..

బీహార్‌లో గ్రామస్థులను ముప్పుతిప్పలు పెడుతున్న పులిని పట్టుకునేందుకు ఆపరేషన్‌ బాగ్‌ను చేపట్టారు. గ‌త కొంతకాలంగా ఎంతో మందిని పొట్ట‌న పెట్టుకున్న పులిని ఎలాగైనా మ‌ట్టుబెట్టేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. నేడు పులిని గుర్తించి గ్రామస్థులు అరవడంతో గోవర్ధనగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బలువా గ్రామ శివారులోని చెరుకు తోటలోకి పారిపోయి పులి అక్కడే తిష్టవేసింది. ఈ చెరుకు తోటను స్థానిక అటవీ అదికారులు, పోలీసుల బృందం చుట్టుముట్టింది. వాల్మీకినగర్‌ టైగర్‌ రిజర్వ్‌ (వీటీఆర్‌) నుంచి జనంలోకి పులిని పట్టుకునేందుకు 8 మంది షార్ప్‌ షూటర్లు, నలుగురు శిక్షణ పొందిన సైనికులు రంగంలోకి దిగారు. పట్నాకు చెందిన నలుగురు ఎస్‌టీఎఫ్‌ షూటర్లు కూడా మాటు వేసి ఉన్నారు. దాదాపు 200 మంది అటవీ సిబ్బంది పొలం చుట్టూ మొహరించారు. గ్రామస్థులు ఎవరూ అటు వైపు రాకుండా నిరోధించేందుకు దాదాపు 80 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. ఇళ్ల నుంచి గ్రామస్థులు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement