Friday, November 22, 2024

అటవీశాఖలో బదిలీలు.. 17 మంది ఐఎఫ్‌ఎస్‌, 8 మంది డీఎఫ్‌ ఓలకు పోస్టింగ్‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అటవీశాఖలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. బదిలీల్లో భాగంగా 17 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, 8 మంది జిల్లా అటవీ అధికారులు ( డిఎఫ్‌ఓ)లకు పోస్టింగులను ఇచ్చారు. నిర్మల్‌ జిల్లా డిఎఫ్‌ఓగా సునీల్‌ హిరేమత్‌, పంచాయతీరాజ్‌ శాఖ జాయింట్‌ కమిషనర్‌ (డిసీఎఫ్‌)గా ప్రదీప్‌ కుమార్‌ శెట్టి, ఫారెస్టు అకాడమీలో డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టుగా ప్రవీణా నియమితులయ్యారు.

సిద్ధిపేట డిఎఫ్‌ఓగా కె. శ్రీనివాస్‌, హన్మకొండ, జనగామ డిఎఫ్‌ఓగా జే. వసంత, ములుగు డిఎఫ్‌ఓగా కృష్ణ గౌడ్‌, యాదాద్రి భవనగిరి డిఎఫ్‌గా పద్మజా రాణి, నిజామాబాద్‌ డిఎఫ్‌ఓగా వికాస్‌ మీనా, రంగారెడ్డి డిఎఫ్‌ఓగా జాదవ్‌ రాహుల్‌ కిషన్‌, నాగర్‌ కర్నూల్‌ డిఎఫ్‌ఓగా జి.రోహిత్‌, మంచిర్యాల డిఎఫ్‌ఓగా శివ్‌ ఆశీష్‌ సింగ్‌, ఖమ్మం డిఎఫ్‌గా సిద్దార్ధ్‌ విక్రమ్‌ సింగ్‌, సంగారెడ్డి డిఎఫ్‌ఓగా సి. శ్రీధర్‌ రావు నియమితులయ్యారు. అలాగే చార్మినార్‌ సర్కిల్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డిఎఫ్‌ఓగా వి. వెంకటేశ్వర రావు, మున్సిపల్‌ శాఖ అదనపు డైరెక్టర్‌గా ఎం. అశోక్‌ కుమార్‌, అమనగల్‌ ఫారెస్టు డివిజినల్‌ అధికారిగా వేణుమాధవ రావు, వికారాబాద్‌ డిఎఫ్‌గా డీవీ రెడ్డి, సూర్యపేట డిఎఫ్‌ఓగా వి. సతీష్‌ కుమార్‌, సూర్యాపేట డిఎఫ్‌ఓ డిఎఫ్‌గా పని చేస్తున్న ముంకుద్‌ రెడ్డిని ఎక్సైజ్‌ శాఖలో డిసీఎఫ్‌గా నియమించారు.అరణ్యభవన్‌లో డీసీఎఫ్‌ (ఐటీ)గా శ్రీలక్ష్మిని నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement