పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న పదిమంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఐజీ కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్న నాగపురి శ్రీనివాసును ఆర్మూర్ కు, ఆర్మూర్లో పనిచేస్తున్న రవికుమార్ ను ఐజి కార్యాలయానికి, వెయిటింగ్ లో ఉన్న ఆరిఫ్ అలీ ఖాన్ ను జగిత్యాల డిఎస్ బి కి, జగిత్యాల ఎస్ బి లో పని చేస్తున్న నాగేశ్వరరావును ఐజి కార్యాలయానికి, అశ్వరావుపేట లో పనిచేస్తున్న జితేందర్ ను ఐజి కార్యాలయానికి, ట్రాన్స్కో నుండి రిప్యాట్రియేషన్ పై వచ్చిన కృష్ణ ను సిరిసిల్ల టౌన్ కు, సిరిసిల్ల టౌన్ లో పనిచేస్తున్న రఘుపతి ని ఐజి కార్యాలయానికి, వెయిటింగ్ లో ఉన్న మొగిలి ని సిరిసిల్ల రూరల్ కు, సిరిసిల్ల రూరల్ లో పనిచేస్తున్న సదన్ కుమార్ ను ఐజి కార్యాలయానికి, సిద్దిపేట సిసిఆర్బి లో పనిచేస్తున్న గురు స్వామిని వరంగల్ కమిషనరేట్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.