Wednesday, January 8, 2025

TG | తెలంగాణ హైకోర్టు సీజే అలోక్‌ ఆరాధే బదిలీ !

  • కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే బదిలీ కోసం సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, పలువురు సీనియర జడ్జ్‌లతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ అలోక్‌ అరాధేను బాంబే హైకోర్టుకు, బాంబే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయను ఢిల్లికి ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది.

అలాగే జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మూడు రికమెండేషన్లను కొలీజియం కేంద్రానికి రికమెండ్‌ చేసింది అయితే… ఈ సిఫారసులను కేంద్రం పరిశీలించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత సిఫారసులు అమలుకానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement