తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు ఆమ్రపాలికి కొన్ని అదనపు బాధ్యతలు ఉండగా వాటి నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది.
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి పూర్తి బాధ్యతలు చేపట్టనుండగా…. మూసీ నది డెవలప్మెంట్ ఎండీగా దానకిషోర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాత్సవ, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పాయ్, హెచ్ఎండబ్ల్యూఎస్ (హైదరాబాద్ వాటర్ వర్క్స్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ మిట్టల్‌ను ప్రభుత్వం నియమించింది.