రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారిని తొలగించి రేవంత్ సర్కార్ అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని కీలక అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఇవ్వాల (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది.
కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా ఉన్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి.మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారిణి అభిలాషా అభినవ్ నియమితులయ్యారు. కాగా, 2010 నుంచి 2018 వరకు శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన వి.మమత.. 2018 నుంచి కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. అలాగే శేర్లింగపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి డిప్యుటేషన్‌ను రద్దు చేసి ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిణి స్నేహా శబరీష్‌కు బాధ్యతలు అప్పగించారు.
వీరితో పాటు మరికొందరు డిప్యూటీ కమిషనర్లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది.. జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణ మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎస్‌ఈగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఎస్ ఈగా ఉన్న మల్లికార్జున్ ఈఎన్ సీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
జీహెచ్‌ఎంసీ ఫలక్‌నుమా డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాసరెడ్డి, ఫలక్‌నుమా అసిస్టెంట్ కమిషనర్ డి.లావణ్య, కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ వి.నర్సింహలను నియమించారు. సంతోష్ నగర్ డిప్యూటీ కమిషనర్ గా ఎ.నాగమణి, చార్మినార్ డిప్యూటీ కమిషనర్ గా ఎ.సరితను నియమిస్తూ జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు.