తెలంగాణలో పనిచేస్తున్న 51 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 31వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని ఆదేశించడంతో గత పది రోజులుగా రెవెన్యూ, పోలీస్ శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు నాన్ క్యాడర్ ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారుల వరకు మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నాయి.
- Advertisement -