Tuesday, November 26, 2024

మీడియా ఆకాడమీ ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దళిత జర్నలిస్టులకు రెండు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుగు అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, తెలంగాణ షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో రెండు రోజులపాటు దళిత జర్నలిస్టుల ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ విషయమై శనివారం సమాచార భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ మహమ్మారి సోకిన 3915 మంది జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున రూ.10 వేలకు తగ్గకుండా ఆర్థిక సాయం అందించామన్నారు. కొవిడ్‌తో మరణించిన 64 మంది జర్నలిస్టు కుటుంబాలకు రూ.2 లక్షల వంతున ఆర్థికసాయం పంపిణీచేశామన్నారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు జర్నలిస్టుల శిక్షణకు ఆటంకం కలిగిందన్నారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తగ్గిన పరిస్థితులలో మళ్లి శిక్షణ కార్యక్రమాలను ఉదృతం చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటి వరకు ఉమ్మడి 9 జిల్లాల విలేకరుల శిక్షణ తరగతులను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 26, 27 జవహార్‌ లాల్‌ నె#హూ యూనివర్సిటీ ఆడిటోరియం- మాసాబ్‌ ట్యాంక్ హైదరాబాద్‌ లో దళిత జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. శిక్షణా కార్యక్రమాన్ని సంక్షేమశాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించనున్నట్లు వివరించారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య… ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దళిత బంధు, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ పై అవగా#హన కల్పిస్తారని, సీనియర్‌ జర్నలిస్టు బుర్రా శ్రీనివాస్‌ సాయంత్రం 4 నుండి సాయంత్రం 5 వరకు డిజిటల్‌ మీడియా పై ప్రసంగిస్తారని తెలియజేశారు.ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఉమ్మడి 9 జిల్లాల్లో సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement