హైదరాబాద్, ఆంధ్రప్రభ : శాస్త్రీయ పద్దతిలో తేనేటీగల పెంపకంపై ఆసక్తిగల రైతులకు సెప్టెంబరు 4 నుంచి 9 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ విషయమై సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తేనేటీగల ఆసక్తి ఉన్న రైతులు, నిరుద్యోగ యువత ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరు కావచ్చని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వీ. సునీత తెలిపారు.
శిక్షణలో పాల్గొనే వారికి తేనెటీగల పెంపకంలోని మెలకువలతోపాటు, మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. 25 మంది రైతులు, యువతకు ఈ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణలో పాల్గొనే వారికి ఉచిత భోజన వసతులు కల్పిస్తామన్నారు. జాతీయ తేనెటీగల పెంపకం, తేనెటీగల మిషన్, తేనెటీగల బోర్డు సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు మరిన్ని వివరాల కోసం 9494875941 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.